ఆశ వర్కర్లను వేధింపులకు గురిచేస్తున్న సూపర్వైజర్ పై చర్యలు చేపట్టాలి!
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి.
శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండల పరిధిలో పని చేస్తున్న ఆశా వర్కర్లను పి, హెచ్, సి లో స్టాఫ్ తక్కువగా ఉన్నారని నేపoతో ఆశా వర్కర్స్ విధులు కొనసాగించాలని ఉన్నతాధికారులు వేధింపులు గురి చేస్తున్నారని వాటిని వెంటనే ఆపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పండగ పూట కూడా విధులు కొనసాగించాలని లేనిపక్షంలో మెమోలు జారీ చేస్తామని కచ్చితంగా మీరు డ్యూటీ చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
తోటి ఉద్యోగులు అన్ని చూడకుండా అసభ్య పదజాలాలతో దుర్భాషలాడుతున్నారన్నారు. పిహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్స్ కి మంచినీటి సౌకర్యం తో పాటు మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తోటి ఉద్యోగులు అన్ని చూడకుండా వేధింపులు గురి చేస్తున్న సూపర్వైజర్ మెడికల్ ఆఫీసర్ పై వెంటనే విచారణ చేపట్టి ఉన్నత అధికారులు చర్యలు చేపట్టాలని.పీ,హెచ్ సి అంబులెన్స్, 112 లేకున్నా ఆశా వర్కర్స్ గర్భిణీలను సొంత ఖర్చులతో హాస్పటల్ తీసుక వెళ్లిన సందర్భాలు ఉన్నవని ఈ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచనలు చేయాలని లేనిపక్షంలో సిఐటియూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ తో పి. హెచ్ సి ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.






