8 August, 2026 | 2:00 AM

పాఠశాలలో బోనాల పండుగ

08-08-2026 12:18 AM

మహబూబాబాద్,విజయక్రాంతి: భావితరాలు మన సంస్కృతి సంప్రదాయాలను పాటించే విధంగా చిన్నతనం ఉండే వారికి వివరించాలని లక్ష్యంతో పాఠశాలలో బోనాల పండుగ నిర్వహించినట్లు కురవి మండల కాసిం తండా హెడ్మాస్టర్ మంజుల తెలిపారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థుల చేత బోనాల పండుగ నిర్వహించారు. ప్రకృతిని పూజించే విధంగా నిర్వహించే బోనాల పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు.