7 August, 2026 | 11:10 PM

ఆదర్శ పాఠశాలలో బోనాల సందడి

07-08-2026 10:01 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా  విద్యార్థులచే బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య ప్రత్యేక  చొరవతో  గ్రామీణ స్థాయి పండుగలు బోనాల సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు చిన్నప్పటినుంచే  తెలియజేసేలా బోనాల పండుగ కార్యక్రమాన్ని పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు ఆనంద ఉత్సవాలతో పాల్గొన్నారు.