8 August, 2026 | 1:18 AM

సోలక్‌పల్లిలో ఘనంగా బోనాల పండుగ

08-08-2026 12:12 AM

హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారం, ఆగస్టు 7 (విజయక్రాంతి) : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని సోలకపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బోనాల పండుగ,

జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి, ఐకమత్యంతో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.