8 August, 2026 | 2:14 AM

లారీ యాజమాన్యాల డిమాండ్లు పరిష్కరించండి

08-08-2026 01:08 AM

ఎమ్మెల్సీ అంజిరెడ్డి 

నిర్మల్ ఆగస్టు 7 (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ లారీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో భాగ్యనగర్ లారీ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జి దుర్గాప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరుకు రవాణాకు వినియోగిస్తున్న లారీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

జీవో నెంబర్ 60 ని సవరించాలని జాతీయ రహదారులపై వానలు నిరుపేందుకు ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు విచారణ జరపకుండా తప్పులు కేసులు పెడుతున్నారని అదనపు జరినామాలు విధించి వేధిస్తున్నారన్నారు ఫిట్నెస్ చార్జీలు తగ్గించాలని రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఇన్సూరెన్స్ కల్పించి ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వమే చెల్లించేలా చూడాలన్నారు. ఈ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గణేష్ ఉపాధ్యక్షులు మాధవ్ జిల్లా అధ్యక్షులు మధు ఫయాజ్ నాయకులు జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.