కేంద్ర మంత్రిని కలిసిన ముధోల్ ఎమ్మెల్యే
08-08-2026 01:10 AM
భైంసా ఆగస్టు 7 ( విజయక్రాంతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసి ముధోల్ నియోజకవర్గం సమస్యలను విన్నవించినట్టు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యే కేంద్ర మంత్రితో భేటీ అయి బైంసా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టు వివరించారు.






