8 August, 2026 | 1:18 AM

‘డంపింగ్’ నీడలో దుర్భర జీవితం

08-08-2026 12:00 AM

చెత్తే ఉపాధి... కన్నీరే జీవితం

జవహర్ నగర్‌లో ఏరుకునే వారి దయనీయ పరిస్థితి

జవహర్‌నగర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఒకవైపు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నా, మరోవైపు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో వందలాది కుటుంబాలు చెత్తనే నమ్ముకుని బతుకుతున్నాయి. ప్రతిరోజూ వేల టన్నుల వ్యర్థాల మధ్య ప్లాస్టిక్, ఇనుము, బాటిళ్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉదయం నుంచే చెత్త లారీల కోసం ఎదురుచూసే వీ రు, ప్రమాదకర వ్యర్థాల మధ్య విలువైన వ స్తువులు వెతుకుతూ ప్రాణాలను సైతం ప ణంగా పెడుతున్నారు. గాజు ముక్కలు, వైద్య వ్యర్థాలు, రసాయన పదార్థాల వల్ల గాయా లు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వే ధిస్తున్నా పొట్టకూటి కోసం అదే పనిని కొనసాగిస్తున్నారు.

అనేక మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ అందడం లేదని, నిరాశ్ర య కుటుంబాలకు ఇళ్ల సౌకర్యం లేక గుడిసెల్లోనే జీవనం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పేదరికం కారణంగా కొంతమంది చిన్నారులు చదువుకు దూరమై చెత్త ఏరుకునే పనిలోకి దిగడం ఆం దోళన కలిగిస్తోంది. సేకరించిన ప్లాస్టిక్, ఇతర వస్తువులను మధ్యవర్తులకు అతి తక్కువ ధ రలకు విక్రయించాల్సి రావడంతో రోజంతా కష్టపడినా చేతికి వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

చెత్త ఏరుకునే వారి (రాగ్ పికింగ్)  సమస్యలు: 

ఆరోగ్య సమస్యలు వీరు ఎలాంటి రక్షణ కవచాలు అనగా గ్లౌజులు మాస్కులు లేకుండా పదునైన గాజు ముక్కలు రసాయనాలు, ఇన్ఫెక్షన్ కలిగించే వ్యర్థ పదార్థాలను తాకడం వల్ల మీరు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు.                          

౧. ఆర్థిక దోపిడి: వీరు సేకరించిన ప్లాస్టిక్ ఆయుధం వంటి రీసైక్లింగ్ వస్తువులను స్థానిక వ్యాపారులకు చాలా తక్కువ ధరలకే (కిలో ఐదు రూపాయల నుండి 15 రూపాయలకు) అమ్ముకోవాల్సి వస్తోంది).

౨. సామాజిక నిర్లక్ష్యం సమాజంలో వీరికి తగిన గుర్తింపు గౌరవం లభించకపోవడం  గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలుపొందలేకపోతున్నారు.

3. బాల కార్మిక వ్యవస్థ: సరైన విద్య అందకపోవడం వల్ల చాలామంది చిన్న పిల్లల సైతం ఈ వృత్తిలోకి దిగుతున్నారు.                        

ప్రభుత్వ చర్యలు: 

1.నమస్తే పథకం: 

కేంద్ర ప్రభుత్వం నమస్తే స్కీం పరిధిని వి స్తరించి అందులో చెత్త ఏరుకునే వారిని కూడా చేర్చింది. దీని ద్వారా వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా గుర్తింపు కార్డులు  వారి పిల్లలకు స్కాలర్షిప్ లు అందిస్తున్నారు.

2. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026: 

కేంద్ర పర్యావరణ శాఖ తీసుకువచ్చిన కొత్త నియమాల ప్రకారం చెత్తను ఇళ్ల వద్ద నుండి నాలుగు రకాలుగా (తడి, పొడి, సానిటరీప్రమాదకమైన వ్యర్ధాలు వేరు చేయడం తప్పనిసరి చేశారు. ఇది చెత్త ఏరుకునే వారి పనిని సులభతరం సురక్షితం చేస్తుంది.

౩. స్వచ్ఛ భారత్ మిషన్: 

వివిధ నగరాలలో ఎన్జీవోల సహాయం తో చెత్త ఏరుకునే వారికి అధికారిక శిక్షణ ఇ చ్చి మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకువస్తూ సామాజిక జీవన ప్రమాణాలు పెంచవచ్చు. ఈ విధమైన పథకాలతో జవహర్ నగర్ ని రాగ్ పికింగ్ ఫ్రీ ఏరియాగా మార్చి వృద్ధుల ను, బాలబాలికలను చెత్త ఏరుకునే పని నుం డి విముక్తి కల్పించి. బాల బాలికలను విద్యాసంస్థలలో వృద్ధులను ఆశ్రమాలలో చేర్పిం చి ప్రభుత్వం వారికి సౌకర్యాలు కల్పించాలని జవహర్‌నగర్ ప్రజలు కోరుతున్నారు.

పూట గడవాలంటే కష్టంగా ఉంది..

మాది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గండిపేట ప్రాంతం పొట్టకూటి కోసం కుటుంబంతో సహా హైదరాబాదులోని జవహర్ నగర్ ,(సిపిఐ కాలనీ) కి వలస వచ్చి గుడిసె వేసుకొని జీవిస్తున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి.  పూట గడవడం కోసం చెత్త ఏరుకొని ఈ వయసులో బతుకును వెల్లదీస్తున్నాం. ఈ వృద్ధాప్యంలో మాకు ఆదరణ చూపే వారే కరువయ్యారు. ప్రభుత్వం ఇకనైనా మాకు వృద్ధాప్య పింఛన్ తో పాటు జీవనోపాధి కోసం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తే ఈ వయసులో ఆనందంగా ఉంటాం. 

- (దండుగుల రాములమ్మ, సీపీఐ కాలనీ డెంటల్ కాలేజ్ వద్ద..)

అర్ధాకలితో జీవిస్తున్నాం:

వృద్ధులమైన మేము అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. అర్ధాకలితో జీవిస్తున్నాం. పూట గడవాలంటే కష్టంగా ఉండటంవల్ల తప్పనిసరి పరిస్థితులలో ఈ వృత్తిని నమ్ముకొని ఉదయం 6 గంటలకు రోడ్ల మీదికి వచ్చి చెత్త వాటర్ బాటిళ్లు తదితర ప్లాస్టిక్ సామాన్లను వేరుకొని అమ్మి జీవిస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని సరియైన వసతులు కల్పించి మా జీవితాలను బాగు చేయాలి.  

 బలరాం, గబ్బిలాల పేట

వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. 

తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ముఖ్యంగా జవహర్ నగర్‌లో డంపింగ్ ఏరియాలలో రోడ్ల మీద చెత్త ఏరుకొని జీవించే అభాగ్యుల పరిస్థితులను చక్కదిద్దేందుకు వజ్రేశ్ యాదవ్ సహకారంతో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయటానికి సాయి శక్తులా కృషి చేస్తాం. 

 ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాచారం ఫైర్ విక్టిమ్ కాలనీ