పెద్ది దృష్టి ఆయేషా వైపు..!
టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటివరకూ మూడుసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను జూన్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఏదేమైనా ఈ గ్యాప్‌లో వస్తున్న పలు క్రేజీ అప్డేట్స్ మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్ కోసం చిత్ర యూనిట్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్‌ను తీసుకోబోతోందట. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలోని ‘షరారత్’ పాటతో సోషల్ మీడియాను ఊపేసిన ఆయేషా ఖాన్, తన డ్యాన్స్, గ్లామర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాటలో ఆమె వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులకు ఫిదా అయిన దర్శకుడు బుచ్చిబాబు..
చరణ్ సరసన ప్రత్యేక గీతం కోసం ఆమెనే పర్ఫెక్ట్ అని భావించారట. చరణ్ లాంటి అద్భుతమైన డ్యాన్సర్ పక్కన ఆయేషా ఖాన్ వంటి ఎనర్జిటిక్ బ్యూటీ తోడైతే, ఆ పాట బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ ఇటు అభిమానులూ అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ స్పెషల్ సాంగ్ కోసం ముందుగా మృణాల్ ఠాకూర్, మానస వారణాసి వంటి పేర్లు వినిపించాయి.
కానీ, ప్రస్తుతం యూత్‌లో ఆయేషా ఖాన్‌న్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఆమెవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏఆర్ రెహమాన్ ఊర మాస్ ట్యూన్ సిద్ధం చేశారని, ఇది సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనుందని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయేషా ఖాన్ ఐటమ్ సాంగ్ ఒక కలర్‌ఫుల్ అట్రాక్షన్‌గా మారుతుందంటున్నారు నెటిజన్లు. ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకులను అలరించేలా ఆయేషా ఖాన్‌ను రంగంలోకి దించడం సినిమా బిజినెస్‌కు కూడా కలిసొచ్చే అంశమే.






