గణపురంలో 169.4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
20-07-2026 06:00 PM
గణపురం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో సోమవారం అక్రమంగా నిలువ చేసిన 169.4 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, గణపురం ఎస్ఐ బొరగల అశోక్ సివిల్ సప్లై, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ఒకే చోట నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన మోటం సారంగపాణి, తూర్పాటి వెంకటేశ్ లను అదుపులోకి తీసుకొని స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గణపురం మండల కేంద్రంలోని లక్ష్మీ గణపతి రైస్ మిల్లు కు తరలించారు.






