మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన పటేల్ రమేష్‌రెడ్డి
18-08-2026 01:52 AM
చివ్వెంల, ఆగస్టు 17: చివ్వెంల మండలం మోదినిపురం గ్రామ మాజీ సర్పంచ్ కన్న బిక్షం ఇటీవల మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. బిక్షం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సగరపు సునీత ప్రసాద్, గ్రామ నాయకులు సైదులు, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






