గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఫోక్సో అంశాలపై అవగాహన
చౌటుప్పల్, ఆగస్టు 17 : మండలంలోని మల్కాపురం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు స్కోప్ సంస్థ ఆధ్వర్యంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పోక్సో అంశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుందని పిల్లలు కూడా మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా చూడాలని అన్నారు.
పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినట్లయితే ఫోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేస్తారు అని తెలిపారు .అదేవిధంగా చైల్ లేబర్ (బాల కార్మిక వ్యవస్థ), గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల చేత బాల్య వివాహాల బాల్య వివాహాల నిర్మూలన కొరకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెడ్మాస్టర్ ఆర్ శోభ ,స్కోప్ సంస్థ ప్రతినిధి బి. నరసింహ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






