బస్టాండ్ లో ప్రయాణికుల కిటకిట
01-06-2026 07:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు టీజీ ఆర్టీసీ బస్సులు పంపడంతో నిర్మల్ బస్టాండ్ లో బస్సులు లేక జనం ఇబ్బంది పడ్డారు. నిర్మల్ డిపో నుండి 80, బైంసా డిపో నుండి 40 బస్సులు సీఎం పర్యటనకు కేటాయించడంతో స్థానికంగా బస్సులు లేక వృద్ధులు చిన్న పిల్లలు మహిళలు బస్సుల కోసం పడరాని పాటుపడ్డారు. ప్రతి రూట్లో ప్రతి పెరగడంతో ఆర్టీసీ అధికారులు చేతులు ఎత్తేశారు. దీంతో ఏ బస్సు వచ్చిన జనం పరుగులు తీస్తూ ఎక్కెందుకు కుస్తీర్పట్టారు. జనాలకు ఇబ్బంది కలగడపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై గంటల తరబడి నిలబడ్డ బస్సులు లేక అవస్థలు పడ్డారు.






