1 June, 2026 | 8:29 PM

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ అంకిత్

01-06-2026 07:24 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, డీఆర్ఓ పద్మావతితో కలసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, పలు సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.