1 June, 2026 | 8:28 PM

తాటి బుచ్చన్నను పరామర్శించిన నాయకులు

01-06-2026 07:29 PM

మంథని,(విజయక్రాంతి): ఇటీవల ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి గాయాలపాలై, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు తాటి బుచ్చన్న గౌడ్‌ను సోమవారం ప్రముఖ న్యాయవాది చేతిరెడ్డి రఘుత్తం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోటిగారి కిషన్ జీ తదితరులు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్స వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. బుచ్చన్న త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సన్నిహితులు పాల్గొన్నారు.