ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం
ఆర్మూర్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యేండల ప్రదీప్ చేతుల మీదుగా మాజీ ఎంపీపీ ఆర్మూర్, తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, పస్క నర్సయ్యను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్‌చార్జిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి, ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సల్ల ప్రవీణ్ పాల్గొని పస్క నర్సయ్యకు అభినందనలు తెలియజేశారు. జిల్లాల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పస్క నర్సయ్య మాట్లాడుతూ... తనపై ఉంచిన నమ్మకానికి వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి, రాష్ట్ర అధ్యక్షులు యేండల ప్రదీప్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సంఘాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించి ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం కోసం అంకితభావంతో పని చేస్తానని పేర్కొన్నారు.






