30 June, 2026 | 9:20 PM

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

30-06-2026 08:19 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా గంధమల్ల, బస్వపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో భూమి కోల్పోయిన రైతులకు త్వరలోనే నిధుల విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు.

అదేవిధంగా వైటిడిఏలో భూములు కోల్పోయిన వారికి కూడా న్యాయం చేస్తామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధి, సాగునీటి వసతుల మెరుగుదలతో పాటు ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆలేరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించే విషయమై పరిశీలన చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.