30 June, 2026 | 9:20 PM

Breaking News

నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి

30-06-2026 08:25 PM

- సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ 

గజ్వేల్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ మంగళవారం గజ్వేల్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. గ్రేవ్, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అలాగే నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రూరల్ సీఐ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు సీసీ కెమెరాలు, వాహన పార్కింగ్ షెడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏసీపీ నర్సింలు, సీఐ రవిరాజు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.