7 June, 2026 | 4:16 AM

గెలుపే లక్ష్యంగా చేయాలి

07-06-2026 12:00 AM

తెలంగాణలో అధికారంలోకి రావాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

యాదాద్రి జిల్లాలో హైదరాబాద్ డివిజన్ పార్టీ శిక్షణా తరగుతులు ప్రారంభం

హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ

యాదగిరిగుట్ట, జూన్ 6 (విజయక్రాతి): తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియాన్ 2026ను శనివారం హైదరాబాద్ డివిజన్ శిక్షణా కేంద్రాలను జిల్లాలోని వడయగూడెం గ్రామంలోని సురేంద్రపురి సమీపంలోని ఆర్యవైశ్య సత్రం, యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని ఓ రిసార్ట్స్‌లో నిర్వహించారు.

ఈ శిక్షణా శిబిరాలను రాంచందర్‌రావు ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉన్నదన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ పార్టీ అధికారంలోకి వచ్చేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలి అన్నారు.

పార్టీ కార్య కర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజే పీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. 

యాదగిరీశుడికి ప్రత్యేక పూజలు 

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని బీజేపీ ప్రముఖులు దర్శించుకున్నారు. శిక్షణా శిబిరంలో భాగంగా యాదగిరిగుట్టకు వచ్చిన మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యా దలతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.