గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు
06-06-2026 05:23 PM
ఉప్పర పల్లి కోర్టుకు బొల్లా
హైదరాబాద్: నిన్న కాంచీపురంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. గండిపేటలో సర్వే నంబర్ 18లో ఉన్న 9.28 ఎకరాల భూకబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించి భూమి కబ్జా, విక్రయానికి ప్రయత్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు గండిపేట భూ కబ్జా కుట్ర కేసులో బొల్లాను పోలీసులు ప్రశ్నించారు.






