ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి
సమగ్ర ఓటర్ సవరణలో అంతా భాగస్వాములు కావాలి
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల,(విజయక్రాంతి): ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని సమగ్ర ఓటర్ సవరణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణ 13 వ వార్డు 143 145వ, 6వ వార్డు 125 126 127వ బూత్ లలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం స్థానిక 13వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, 6వ వార్డు కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై వార్డు సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి లు హాజరై ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలిని సమగ్ర ఓటర్ సవరణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకొని ఓటర్ మ్యాపింగ్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటరు జాబితా సవరణ మ్యాపింగ్ కోసం ప్రతి వార్డులో వార్డు సభలు నిర్వహించాలని అధికారుల నుఆదేశించారన్నారు. ఓటర్ జాబితాలో ఓటు లేనిచో సంబంధిత ధ్రువపత్రాన్ని బిఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంద న్నారు. నూతన ఓటర్ల నమోదు కోసం ఫారం 6 ఓటర్ లిస్టు సవరణకై ఫారం నెంబర్ 8 అభ్యంతరాల కోసం ఫారం నెంబర్ 7 ద్వారా ఇవ్వాలని అవగాహన కల్పిస్తూ వార్డు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర, వైస్ చైర్మన్ షహీద్, పలువురు కౌన్సిలర్లు అన్నం అనిల్, ఎడ్ల రమేష్, తోట గంగాధర్, బిఎల్ఓలు గంగుల (చింత) అరుణ, శీలం హిమగిరి, వార్డ్ ఆఫీసర్ రవళి బిఎల్ఎ వోలెపు రాజేష్, వార్డు ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






