జూనోని పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు
27-08-2026 11:05 PM
బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలం జూనోని పాఠశాలలో విద్యార్థులు తాగేందుకు ఉపయోగించే నీటి పంపు పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. పంపు చుట్టూ మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులకు శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందేలా పాఠశాల అధికారులు, గ్రామపంచాయతీ వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.






