3 April, 2026 | 2:28 AM

పారాక్వాట్ నిషేధం..

03-04-2026 12:20 AM

60 రోజులపాటు క్రయవిక్రయాలు బంద్ 

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అతిక్రమిస్తే చర్యలు: జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): పారాక్వాట్ ఒక అత్యంత ప్రమాదకరమైన రసాయన పురుగుమందు. ఇది మనుషులు, జంతువులు మరియు పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పురుగు మందును నిషేధించాలని నిర్ణయించింది. మానవ శరీరం నరాల వ్యవస్థ పై అత్యంత ప్రభావం చూపే పారాక్వాట్ను నిషేధిస్తూ ఇతరులు జారీ చేసింది.

మార్కెట్లో విచ్చలవిడిగా ఈ గడ్డి మందు లభించడంతో రైతులకు తెలియగా కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి వెంటనే విక్రయంతో పాటు కొనుగోలు ప్రక్రియను కూడా అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత నిర్లక్ష్యం వహించిన మనిషి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలియడంతో ఇకనైనా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 

60 రోజుల నిషేధం..

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, సహకార శాఖ ద్వారా రైతులు, ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ముఖ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రమాదకరమైన రసాయన పురుగుమందు అయిన పారాక్వాట్ దాని ఉత్పత్తులు/ఫార్ములేషన్ల వినియోగం వల్ల మానవులు, జంతువులకు హానికర ప్రభావాలు ఉన్నాయని వివిధ నివేదికలు సూచించాయి. ఈ నేపథ్యంలో, ఇన్సక్టిసైడ్స్ Act, 1968 ప్రకారం ప్రభుత్వం అధికారాలను వినియోగించి క్రింది ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్, దాని ఉత్పత్తుల అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం, తక్షణ ప్రభావంతో 60 రోజుల పాటు పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. రైతులు, వ్యాపారులు సంబంధిత వర్గాలు ఈ నిషేధాన్ని గౌరవించి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. 

మనుషులపై దుష్ప్రభావాలు..

పారాక్వాట్ శ్వాసకోశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఊపిరితిత్తులకు తీవ్రమైన నష్టం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దీర్ఘకాలంలో లంగ్ ఫైబ్రోసిస్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పారాక్వాడ్ మందు మనిషి లోపలికి చేరితే తీవ్ర స్థితిలో ప్రాణాపాయం నోటిలో & గొంతులో సమస్యలు నోటిలో గాయాలు, కాలినట్టు బాధ, గొంతు మండడం, మింగడంలో ఇబ్బంది, నరాల వ్యవస్థపై ప్రభావం, తలనొప్పి తలనిర్భంధం, బలహీనత ఏర్పడుతుందని వైద్యుల ద్వారా తెలుసుకున్న వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ఇదే విషయాన్ని నివేదించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మనుషులపై అత్యంత ప్రభావం చూపే తారక్ వాటిని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. 

విక్రయిస్తే కఠిన చర్యలు..

పారక్వాట్ శరీరంలోకి వెళ్లిన తర్వాత బయటకు తీయడం చాలా కష్టం. చిన్న పరిమాణం కూడా ప్రమాదకరం ఎక్కువగా ప్రభావం ఊపిరితిత్తులపై ఉంటుంది.  పారాక్వాట్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని వైద్యుల సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. భద్రత గల ప్రత్యామ్నాయ పురుగుమందులు వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని సూచించింది. ఈ పురుగుమందును రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఎక్కడ విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటాం. 

బి. వెంకటేష్ జిల్లా వ్యవసాయ అధికారి మహబూబ్ నగర్