3 April, 2026 | 4:12 AM

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల అందించడమే ప్రభుత్వ లక్ష్యం

03-04-2026 12:23 AM

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్

గోపాలపేట ఏప్రిల్ 2: రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ బిల్లలు చిన్నారెడ్డి అన్నారు, గురువారం గోపాలపేట మండలం జగన్న తిరుమలాపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో చిన్నారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. 

కార్యక్రo ప్రారంభానికి ముందు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన సందేశాన్ని చదివి గ్రామ ప్రజలకు వినిపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రెండున్నర ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చదివి వినిపించారు.

ఈ సందర్బంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చి అభివృద్ధి ఫలాలను అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లాలోని 268 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు.

గ్రామంలో ప్రజలకు జరిగిన మంచిని తెలియజేయడమే కాకుండా, ఇంకా గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయాలని గ్రామసభ ముందు ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డివైస్ ఓ  సుధీర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి గోపాల్, ఉప సర్పంచ్ రాజు, గ్రామ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.