ఎమ్మెల్యే గూడెం వర్సెస్ కాటా
- పటాన్‌చెరులో అవినీతి చిచ్చు!
మైనింగ్ వ్యవహారంతో రగడ
చిట్టాలను బయటపెట్టుకున్న నేతలు
ఇద్దరి ప్రమాణాల నేపథ్యంలో ఉద్రిక్తత
ముందస్తుగా కాటా శ్రీనివాస్‌గౌడ్ హౌస్ అరెస్టు
సంగారెడ్డి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం లో రాజకీయ చిచ్చు రోజురోజుకు పెరుగుతోం ది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ మధ్య అవినీతి చిచ్చు నెలకొంది. ఒక రిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నువ్వా.. నేనా అనే రీతిలో మాటల యుద్ధానికి తెరలేపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోద రుడు మధుసూదన్‌రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులు నమోదు వ్యవహారం మళ్లీ తెరమీదికి రావడంతో కాటా శ్రీనివాస్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి మధ్య రాజకీయ రగడ ప్రారంభమైంది.
చిలికిచిలికి గాలివానలాగా మార డంతో గురువారం ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ బహిరంగంగా సవా ళ్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే అక్రమాస్తుల చిట్టా విప్పుతానని కాటా శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించ గా, ఎమ్మెల్యే సైతం అదే స్థాయిలో కాటా చేసి న అక్రమాలపై ఆరోపణలు చేశారు. అక్రమ మైనింగ్ పేరుతో కోట్లు దండుకున్నారని, వం దల ఎకరాలు కబ్జాకు ఎమ్మెల్యే పాల్పడ్డారని కాటా ఆరోపించగా, ఇందిరమ్మ ఇండ్ల పేర, మంత్రి కుమార్తె వివాహం పేరుతో కోట్లు వసూలు చేశారని కాటాపై ఎమ్మెల్యే కౌంటర్ వేశారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టాపై కాటా చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే ప్రత్యారోపణలు చేయ గా బుధవారం..
కాటా శ్రీనివాస్‌గౌడ్ అవినీతిపై బీరంగూడలోని శివాలయంలో ప్రమా ణానికి తాను సిద్ధమని, ఎమ్మెల్యే ఇందుకు సిద్ధమైతే రావాలని సవాల్ విసిరారు. దీంతో నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ నాయకు ల్లో, ఇటు బీఆర్‌ఎస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం రెండు పార్టీల నేతలు కలిస్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందని భావించిన పోలీసులు కాంటా శ్రీనివాస్ గౌడ్‌ను గురువారం ముందస్తుగా హౌస్ అరె స్టు చేశారు.
కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కాటాను నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమాలు బయటపడతాయనే ఎమ్మె ల్యే ముందస్తుగా హౌజ్ అరెస్టు చేయించారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. కాగా పటాన్‌చెరు నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా మూడోసారి గూడెం మహిపాల్‌రెడ్డి గెలుపొందారు.
అనూహ్యంగా కాంగ్రెస్ కండుగా కప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చు చెలరేగింది. మహిపాల్‌రెడ్డి కేవలం తమ అక్ర మ మైనింగ్ కేసుల నుంచి తప్పించుకోవడాని కి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారని, నిజమైన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కాటా శ్రీనివాస్‌గౌడ్ వర్గీయులు ఆరోపిస్తూ వచ్చారు. వీరిమధ్య వివాదం ఏ స్థాయి కి వెళ్లిందంటే ఎమ్మెల్యేపై అధిష్ఠానానికి ఫిర్యా దు చేసి, ఏకంగా క్యాంపు కార్యాలయం ముం దు కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో అధిష్ఠానం విచారణ కమిటీ ఏర్పాటు చేసి నివేదికను అందించింది.
ఈ పరిణామాలతో ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్‌లో పొసగక పోవడంతో బీఆర్‌ఎస్ వైపు మళ్లీ మొగ్గు చూపారు. తాజాగా పార్టీ ఫిరాయింపు కేసులో సైతం స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో మహిపాల్‌రెడ్డి మరింత స్పీడ్ పెంచారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పనులు చేస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సైతం చక్రం తిప్పి నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసేలా చేశారు. ఈ దశ లో బుల్లెట్ దిగిందా అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.




