3 April, 2026 | 2:27 AM

ఈడెన్‌లో సన్‌రైజ్

03-04-2026 12:46 AM

* బ్యాటింగ్‌లో ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం... మధ్యలో తడబాటు.. మళ్లీ చివర్లో విధ్వంసం.. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీస్కోరు (226/8).. అయితే ఈడెన్ గార్డెన్స్ ఫ్లాట్ పిచ్ కావడంతో ఇంత స్కోరు చేసిన ఎక్కడో అనుమానం... అయితే పవర్ ప్లే తర్వాత కేకేఆర్ బ్యాటర్ల రనౌట్లు, కీలక సమయంలో సన్‌రైజర్స్ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీయడంతో హైదరాబాద్ ఈ సీజన్‌లో బోణి కొట్టింది.

  1. బోణీ కొట్టిన హైదరాబాద్
  2. హోంగ్రౌండ్‌లో కేకేఆర్‌కు షాక్
  3. సమిష్టిగా రాణించిన బ్యాటర్లు

కోల్‌కతా, ఏప్రిల్ 2 : టాస్ గెలిచిన కోల్ కత్తా నైట్ రై డర్స్ కెప్టెన్ అజింక్య రహానే మరో ఆ లోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ పిచ్ కావడంతో సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడారు. తొలి ఓవర్లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ తర్వాత రెచ్చిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్నిహోరెత్తించారు. దీంతో పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ 84 పరుగులు చేసింది. అభిషేక్, హెడ్ తొలి వికెట్ కు 34 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు.

హెడ్ 21 బంతు ల్లోనే 46 (6 ఫోర్లు, 3సిక్సర్లు), అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 (4 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేసా రు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ జోడీ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఇద్ద రూ ధాటిగా ఆడుతూ 53 బంతుల్లో 82 పరుగులు జోడించారు. నితీష్ 24 బంతుల్లో 39, క్లాసెన్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా... సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యఛేదనను కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుగానే ఆరంభించింది.

ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఫిన్ అలెన్ తొలి ఓవర్లోనే చుక్కలు చూపించాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో సహా 25 పరుగులు బాదాడు. దూ కుడు మీదున్న అలెన్ ను హర్షదూబే పెవిలియన్‌కు పంపించాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో రహానే (8) పరుగులకు ఔటవగా.. కామెరూన్ గ్రీన్ అనూహ్యంగా రనౌట య్యాడు. దీంతో పవర్ ప్లేలో 74 పరుగులు చేసిన కేకేఆర్ 3 కీలక వికెట్లు కూడా చేజార్చుకుంది. ఈ దశలో రఘువంశీ, రింకూ సింగ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ ధాటిగానే ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు.

30 బంతు ల్లో 46 పరుగులు జోడించారు. రఘువంశీ కూడా రనౌటవడం, వెం టనే అంకుల్ రాయ్(0), రమణ్ దీప్ సింగ్ (10) ఔటయ్యారు. తర్వా త రింకూ సింగ్ ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. రింకూ 25 బంతుల్లో 35 ( 4 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులకు ఔటవడంతో కేకేఆర్ ఓటమి ఖాయమైపోయింది. 

మిగిలిన బ్యాటర్లు ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో కోల్ కతా 161 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కట్ 3, మలింగ 2, నితీష్ 2 వికెట్లు తీసారు. సన్ రైజర్స్ కు ఈ సీజన్‌లో ఇది తొలి విజ యం. అటు కేకేఆర్ కు వరుసగా రెండో ఓటమి.

స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 226/8 ( హెడ్ 46, అభిషేక్ శర్మ 48, క్లాసెన్ 52 ; ముజరబానీ 4/41, వైభవ్ అరోరా 2/47 )

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 161 ఆలౌట్ ( రఘువంశీ 52, రింకూ సింగ్ 35, ఫిన్ అలెన్ 28 ; ఉనాద్కట్ 3/21 , మలింగ 2/14 , నితీశ్ కుమార్ రెడ్డి 2/17 )