సాంఘిక గురుకుల ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా పరమేశ్వరి
ఎర్రుపాలెం మే 20 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో గల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు) ఇంచార్జ్ ప్రిన్సిపల్ గా బుధవారం నాడు పరమేశ్వరి భాద్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న శుభ సందర్భంగా గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందనలు శుభాకాం క్షలు తెలియ చేశారు.
ఈ సందర్భం గా పరమేశ్వరి మాట్లాడుతూ అందరి సమిష్టి కృషి తో పిల్లలకు నాణ్యమైన విద్య వైద్యం పౌస్టికాహారం పరిశుభ్రమైన పరిసరాలు మౌలిక వసతులు కల్పన కొరకు కృషి చేస్తానని తెలిపారు అందులో బాగంగా నే 2026 -2027 విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండడంతో పాఠశాల పరిసరాలు శుభ్రం చేయిస్తున్నట్లు అలాగే పిల్లలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ పొట్టపింజర చిట్టిబాబు సగ్గుర్తి ముత్యాల రావు ఇనపనూరి నాగేశ్వర్ రావు రవి సగ్గుర్తి మోహన్ రావు లు బాలాజీ సిబ్బంది అనిత కల్పన లు పాల్గొన్నారు.






