మల్లాపూర్‌లో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. 1993లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు బలాన్నిచ్చి, స్థానిక సంస్థలకు అధికార వికేంద్రీకరణ కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధికి కేంద్రబిందువులుగానిలుస్తున్నాయని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సమగ్రాభివృద్ధిసాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సోమరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






