20 June, 2026 | 2:14 AM

టీఆర్పీలో నూతన నియామకం

20-06-2026 12:59 AM
  1. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ గౌస్ పాషా 
  2. నియామక పత్రాన్ని అందజేసిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, పరిగి నియోజకవర్గం ఇన్‌చార్జిగా మహమ్మద్ గౌస్ పాషాను నియమిం చారు. ఈ నియామకాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్ చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మహమ్మద్ గౌస్ పాషాకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లన్న మా ట్లాడుతూ.. రాష్ట్రంలో మైనారిటీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జైపాల్‌రెడ్డి, స్టే ట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ లింగం యాదవ్ పాల్గొన్నారు.

టీఆర్పీలో భారీగా చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జనగామ జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం ఆధ్వర్యంలో పలువురు నాయకులు, యువకులు, సామాజిక కార్యకర్తలు పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరారు. తెలంగాణలో సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు.

యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడిగా రమేష్ 

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల టీఆర్పీ అధ్యక్షుడిగా శిక రమేష్ గౌడ్‌ను నియమించినట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న రమేష్‌గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి కొక్కలకొండ మనోజ్, శేఖర్, శిక వెంకటేష్‌గౌడ్, భరత్, పండు, మధు పాల్గొన్నారు.