20 June, 2026 | 2:17 AM

మన వనరులే మనకు పెట్టుబడి

20-06-2026 01:01 AM
  1. సంపద సృష్టిపై దృష్టి
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  3. ఆదాయ వనరుల సమీకరణపై సమీక్ష

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : మన వనరులే మనకు పెట్టుబడి అని, సం పద సృష్టిపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఆదా య వనరుల సమీకరణపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృ ష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఆ దాయం తీసుకువచ్చే రంగాలపై దృష్టి సా రించాలన్నారు.

గోవా, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయని.. అక్కడ ప్రజలకు ఉపా ధిని కల్పించడమే కాకుండా జీడీపీ పెరుగుదలకు టూరిజం దోహదపడుతుందని తెలి పారు. మన రాష్ట్రంలోనూ అదే తరహాలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నా రు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం రంగా ల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. హెలీకాప్టర్ టూరిజం పెంచాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో పర్యటకాన్ని అభివృద్ధి చేయాల న్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టూరిజం ఆస్తులు పూర్తిస్థాయిలో వినియోగంలో లేవన్నారు. వాటిని అభివృద్ధి చేసి సంపద సృష్టించాలని  స్పష్టం చేశారు. పీపీ పీ ఆధారిత సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేబినెట్ ముందుంచాలని ఆదేశించారు. 

పూడికతీత పనులపై సమీక్ష

లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో చేపట్టిన పూడికతీత పనులపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేసింది. చట్టపరమైన నిబంధనలు పాటించే క్రషర్లకు అనుమతులు ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. నది ఇసుకతో పోలిస్తే రోబో శాండ్ తక్కువ ధరకు లభిసుందని క మిటీ గుర్తించింది. పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. అదే విధంగా రవా ణా శాఖ ఆదాయం, వసూళ్లు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రులతో సమా వేశం ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమం త్రి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ద్వారా ఆదా య సమీకరణపై చర్చించారు. రాష్ట్రంలో భూము ల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువ చ్చారు. 

సమావేశంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథా రిటీ కమిషనర్ శశాంక, తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్-ఎండీ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రె టరీ కృష్ణభాస్కర్,  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హనుమం తు, ట్రాన్స్ పోర్ట్ కమిషన్ ఇళాంభర్తి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్‌పాల్గొన్నారు.