30 July, 2026 | 2:23 AM

మా గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి..

30-07-2026 12:33 AM

జగదేవపూర్, జులై 29: జగదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి, ప్రత్యేక అధికారి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో  అలీరాజ్ పేట్ సర్పంచ్ రాచమల్ల ఎల్లేష్ మాట్లాడుతూ మా మండలం కూడా తెలంగాణ రాష్ట్రంలేనే ఉన్నదని ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ అభివృద్ధి నిధులు అన్ని గ్రామాలకు జనాభా ధమాషా ప్రకారం ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్ సర్పంచ్ లు ఉన్నచోట ఎక్కువ ఇవ్వడం బిఆరెస్ సర్పంచ్ లు ఉన్నా చోట వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రతి నెల సర్పంచ్ లకు జీతాలు పడినట్లు సాఫయి కార్మికులకు సైతం వారి కష్టాన్ని గుర్తించి మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలన్నారు. ఆకలి వేసినపుడు అన్నం పెడితేనే ఆకలి తీరుతుందన్నారు. 

ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవానికి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బిఆరెస్ సర్పంచ్ లు ఉన్నా చోట పేర్లు పంపిస్తే రాజకీయాలు చేసి సర్పంచ్ లకు తెలియకుండానే ఇతర లబ్ధిదారుల పేర్లు వస్తున్నాయి అన్నారు. కలెక్టర్ లాగిన్ లో ఉన్నా పెండింగ్ ఎల్ 1,ఎల్ 2,ఎల్ ల్ 3,లిస్ట్ లో ఉన్న లబ్ధిదారుల పేర్లకు త్వరగా ప్రొసీడింగ్స్ ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి,మండల సర్పంచ్ లు ముచ్చపతి బాలయ్య, కటికల ఓం ప్రకాష్,దీన రాజ లింగం, ఆయా శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.