26 June, 2026 | 3:33 AM

ఆత్మీయుడికి అండగా మన అగ్రిటెక్

26-06-2026 12:04 AM

హైదరాబాద్, జూన్ 25(విజయక్రాంతి): తమతో కలిసిమెలిసి ఆత్మీయంగా మెలిగిని మిత్రుడు అకస్మాత్తుగా కానరాని లోకాలకు వెళ్లడం వారిని ఎంతగానో కలిచివేసింది. త మ ఆత్మీయుడికి అండగా నిలవాలని దృ ఢంగా నిర్చయించుకుని వారు బాసటగా నిలిచారు.

మన అగ్రిటెక్ సంస్థ ఉద్యోగి బోగ రాము ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించ గా ఆ కుటుంబానికి అండగా నిలవాలని మన అగ్రిటెక్ సంస్థ అధినేత పాశికంటి రమే ష్, వారి సిబ్బంది నిశ్చయించుకుని అధినేత రమేష్ చేయుతతో అందరూ కలిసి లక్ష రూ పాయలు తమ ఆర్థిక సహాయంగా అందించి అండగా నిలిచారు.

గురువారం బోగ రాము దశదిన కర్మ సందర్భంగా అధినేత పాశికంటి రమేష్ వారి బృందం లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని చెక్ రూపంలో వారి కుటుంబ సబ్యులకు అందించి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. తమ ఆత్మీయుడికి కోల్పోవడం చాలా బాధ గా ఉందని ఆయన లేని లోటు తీర్చడం ఎవ రి వల్ల కాదని ఆ కుటుంబానికి మనోధైర్యా న్ని అందించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మన అగ్రిటెక్ అధినేత పీ రమేష్‌తో పాటు సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులున్నారు.