26 June, 2026 | 3:32 AM

విత్తన మేళా ప్రారంభం

26-06-2026 12:03 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 25 (విజయక్రాంతి): ముకునూర్ రైతువేదికలో విత్తనమేళను, ముకునూర్ సర్పంచ్ సన్నాయిలశిల్ప ప్రేమాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరిసన్న, స్వల్ప కాలిక రకాలయినటువంటి ఆర్‌ఎన్‌ఆర్ -15048, తెలంగాణ సోనా, కెఎన్‌ఎమ్ -1638, జొన్న, పప్పుదినుసులు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించే ఉద్ధేశంతో ప్రదర్శించడం జరిగింది.

కార్యక్రమంలో సర్పంచ్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పలు రకాల విత్తనాలపై రైతులకు అవగాహనకల్పించి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టిందని, తక్కువకాల పరిమితి బెట్టను తట్టుకునేరకాలు వాడాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహా సూచనలు తీసుకొని మంచి దిగుబడి నిచ్చేరకాలను తీసుకొని ప్రభుత్వం, కల్పించిన  అవకాశాన్నిసద్వినియోగపరుచుకోవాలనికోరారు.  పలువురు రైతులు పాల్గొని స్వల్ప కాలీక రకం కెఎన్‌ఎమ్ 1638, ఆర్‌ఎన్‌ఆర్15048 వరివిత్తనాలు, నానో యూరియా, పచ్చజొన్న (పిఎస్ పివై 2) విత్తనాలు, కొనుగోలు చేసినారు. ఈ కార్య క్రమంలో గ్రామ పెద్దలు, రైతులు ,  ఏఇఓ సృజన ,  తదితర రైతులు పాల్గొన్నారు.