17 August, 2026 | 11:05 PM

బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ గా ఓరుగంటి పురుషోత్తం

17-08-2026 09:13 PM

కోదాడ ఆగస్టు 17 (విజయక్రాంతి): కోదాడ పట్టణానికి చెందిన బిజెపి నాయకుడు ఓరుగంటి పురుషోత్తంను వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ గా నియమిస్తూ సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఎటువంటి సమస్యలున్నా వాణిజ్య సెల్ తరఫున పరిష్కారం కొరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఓరుగంటి పురుషోత్తంకు పలువురు అభినందనలు తెలిపారు.