17 August, 2026 | 10:12 PM

బెజ్జూర్ లో ప్రారంభమైన ప్రజావాణి

17-08-2026 09:12 PM

బెజ్జూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం బెజ్జూర్ మండలంలో సోమవారం ప్రారంభమైంది. మండల కేంద్రంలో గల రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ రామ్మోహన్రావుతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రజావాణిలో 27 దరఖాస్తులు

ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం "27 దరఖాస్తులు"అందాయని శాఖల వారీగా పంచాయతీ రాజ్ శాఖ10, అటవీ శాఖ03, రెవెన్యూ శాఖ03, విద్యుత్ శాఖ02, రోడ్డు & బిల్డింగ్02, పోలీస్ శాఖ02, వ్యవసాయ శాఖ01, పశు సంవర్ధన శాఖ,01 ఆరోగ్య శాఖ01, హౌసింగ్ 01,మహిళా శిశు సంక్షేమ శాఖ01 చొప్పున మొత్తం 27 అర్జీలు వచ్చాయన్నారు.

అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపి 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కారం కానీ ఎడల అట్టి శాఖకు సంబంధించిన అధికారి అర్జీదారునికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రతి అర్జీదారునికి గ్రీవెన్స్ ఐడి ఇచ్చి ఆన్ లైన్ లో స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో విద్య, వైద్య పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్, ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.