17 August, 2026 | 10:14 PM

కిట్స్ కళాశాలలో మొబైల్ ఫోన్ల దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

17-08-2026 09:16 PM

కోదాడ ఆగస్టు 17 (విజయక్రాంతి): కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బ్రహ్మ కుమారీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు మొబైల్ ఫోన్ల అధిక, అనవసర వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు బ్రహ్మ కుమారీస్ సాధకులు, విద్యార్థినులకు మొబైల్ ఫోన్ వినియోగంలో నియంత్రణ, సమయపాలన డిజిటల్ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ విద్యార్థుల విద్యాభ్యాసంలో ఉపయోగకరమైన సాధనంగా మారిందని, ఆన్‌లైన్ తరగతులు, విద్యా వీడియోలు, ఈ-బుక్స్, సమాచార సేకరణ వంటి అనేక విషయాలకు మొబైల్ ఉపయోగపడుతుందని అయితే, అధికంగా లేదా అనవసరంగా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని సదస్సులో విద్యార్థినులకు వివరించారు.

అధికంగా ఫోన్స్ ఉపయోగించుట వలన చదువుపై ప్రభావం చూపుతుందని, సమయ వృథా అవుతుందని, అలాగే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటున్నదని వివరించారు. ఈ అవగాహనా ఈ సదస్సు విద్యార్థినులకు మొబైల్ ఫోన్లను సాంకేతిక సాధనంగా సద్వినియోగం చేసుకుంటూ, వాటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, వివిధ విభాగాదిపతులు రమేష్, స్రవంతి, నరేష్ రెడ్డి, శివాజీ, లక్ష్మణ్,  విద్యార్థి నులు పాల్గొన్నారు.