4 August, 2026 | 3:50 AM

ఎంఎల్‌ఆర్‌ఐటీఎంలో ఓరియంటేషన్ డే

04-08-2026 12:55 AM

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఎంఎల్‌ఆర్‌ఐటీఎంలో నూతనంగా చేరిన బీటెక్ విద్యార్థులకు స్వాగ తం పలుకుతూ ఓరియంటేషన్ డే ఘనంగా నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ఫౌండర్ సెక్రటరీ, మల్కాజిగిరి ఎ మ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అనేది కేవలం డిగ్రీ సాధించడం మాత్రమే కాదని, జ్ఞానం, నైపుణ్యాలు, నా యకత్వ లక్షణాలను పెంపొందించుకుని స మాజానికి సేవ చేసే బాధ్యతాయుతమైన ఇంజనీర్లుగా ఎదగాలని విద్యార్థులకు సూ చించారు.

కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి. శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రపంచం వేగంగా మారుతున్న ఈ కాలంలో నిరంతర అభ్యాసం, కొ త్త నైపుణ్యాల సాధనే విద్యార్థుల విజయానికి కీలకమని అన్నారు. కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు అను శ్రేయరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మురళీ ప్రసాద్, ఎం ఎల్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపా ల్ డాక్టర్ అర్ణబ్ మాలిక్ పాల్గొన్నారు.  కార్యక్రమాన్ని ఫ్రెష్మన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డా.కె. అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.