దళిత మహిళ ఆయాగా పనిచేయాలి
ఇన్సేటక్టర్‌గా దొరల కుటుంబీకులే చేయాలి
సిద్దిపేట జిల్లా చాట్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఆదేశాలు
జగదేవపూర్, ఆగస్టు 2: సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు కులం వివక్ష చూపడం తోటి ఉపాధ్యాయులు సిగ్గుచేటు చర్యగా భావిస్తున్నారు. బాధితురాలు గడ్డం రజిత శనివారం జిల్లా విద్యాధికారికి రాతపూర్వకంగా పిర్యాదు చేసిన బాధితురాలు ఆదివారం విజయక్రాంతితో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లాపల్లి ప్రాథమిక పాఠశాలలో అదే గ్రామానికి చెందిన గడ్డం రజిత (ఎస్సీ) ఇన్సేటక్టర్ గా పని చేస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ కూడా పూర్తి చేసింది.
అయితే ఇమేకన్న సంవత్సరం ముందు రేష్మ ఇన్సేటక్టర్ పనిచేసింది. రేష్మ ను మళ్ళీ ఇన్సేటక్టర్ చేర్చుకునేందుకు హెచ్‌ఎం కొత్త నాటకానికి తెరలేపారని, రేష్మ ను ప్రజావాణిలో దరఖాస్తు ఇప్పించి దాని ఆధారంగా ఆమెను ఇన్సేటక్టర్ గా తీసుకున్నారని రజిత తెలిపారు. తనను ఆయా గా పనిచేయాలని హెచ్‌ఎం సూచించారని, ఎందుకని అడగగా నివు దళిత మహిళవు అయగానే పని చేయాలి, రేష్మ దొరల కుటుంబీకురాలు ఆమె ఇన్సేటక్టర్ గా పనిచేయాలని అవమాన పరిచినట్లు బాధితురాలు బోరున విలపించింది. కులం పేరుతో నా స్థాయి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు.
నేను అమ్మవారి భక్తుణ్ణి...
ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణను విజయక్రాంతి వివరణ కోరగా రామ రామ నేను అమ్మవారి భక్తుణ్ణి మహిళలు అంటే నాకు చాలా గౌరవం, వివక్ష చూపడం నాకు తెలియదు. నేను ఎలాంటి వాడినో గజ్వేల్ విలేకరులను అడిగి తేలుకోండి. రజిత నాకు శత్రువు కాదు. కలెక్టర్ ఆదేశాల మేరకే రేష్మను ఇన్సేటక్టర్ గా తీసుకున్నాను అని వివరించారు. ఈ విషయంపై మండల విద్యాధికారి సైదులు ను వివరణ కోరగా ఇన్సేటక్టర్ ను మార్చిన సంగతి తనకు తెలియదని తెలిపారు.






