3 August, 2026 | 2:56 AM

పెరూలో కూలిన విమానం

03-08-2026 01:40 AM

9 మంది పర్యాటకలు, ఇద్దరు పైలెట్లు మృతి

నాజ్కాలైన్స్ వీక్షించడానికి వెళ్తుండగా ఘటన

బోగోటా, ఆగస్టు 2: ప్రసిద్ధ నాజ్కా లైన్స్ ను వీక్షించడానికి ఆదివారం యూరోపియన్ పర్యాటకులను తీసుకువెళ్తున్న ఒక విమానం పెరూలోని నాజ్కా నగరం వెలుపల ఒక పొలంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో తొమ్మిది మంది ఇటాలియన్, స్పానిష్, జర్మన్‌కు చెందిన వాసులు. మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. ఈ మేరకు స్థానిక అధికారులు తెలిపారు. ఈ విమానం శనివారం సమీపంలోని ఇకా నగరం నుంచి బయలుదేరిందని, దీనిని పెరూవియన్ కంపెనీ ఏరోడియానా నడుపుతోందని నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలిపింది.

మృతులలో 18 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏడుగురు ఇటాలియన్ పౌరులు, 52 ఏళ్ల ఇద్దరు స్పానిష్ వారు, 77, 78 ఏళ్ల ఇద్దరు జర్మన్లు ఉన్నారని పెరూ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన మిగతా ఇద్దరు పైలట్ అమెరికో సలాజర్, కో-పైలట్ ఇరెంకా గ్వానిలో డెల్ కార్పియో అని పేర్కొంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని పెరూ అధికారులు తెలిపారు.