ధ్రువీకరణ పత్రాల కోసం తిప్పలు
13-07-2026 03:58 PM
నిర్మల్ జులై 13 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్, రాంనగర్ , ఆశ్ర కాలనీ లో నివాసం ఉంటున్న ప్రజలకు ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంఐఎం పార్టీ నాయకులు సయ్యద్ మా, ఆన్సర్ మమ్మద్ తెలిపారు. పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ కుల ధ్రువీకరణ ఇతర దృపత్రాల కోసం రూలర్ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు చెబుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పిన తమకు న్యాయం జరగడం లేదని రూలర్ అర్బన్ సమస్యతో తతాము పిల్లలు కోసం ఇబ్బంది పడుతున్నామని పట్టణంలోని ధృవీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.






