calender_icon.png 6 February, 2026 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే మోదీని రావొద్దన్నా

06-02-2026 02:14:24 AM

లోక్‌సభలో ప్రధానిపై విపక్షాలు దాడి చేసే అవకాశం

భద్రతా రీత్యా సూచించానన్న స్పీకర్ ఓం బిర్లా

మోదీ ప్రసంగం లేకుండానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: లోక్‌సభలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం లో స్పీకర్ ఓం బిర్లా గురువారం కీలక వ్యాఖ్య లు చేశారు. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష సభ్యులు దాడి చేసే అవకాశం ఉందని, అందుకే సభకు రావొద్దని ప్రధాని మోదీకి తాను సూచించానని అన్నారు. ‘పార్లమెంట్‌లో బుధవారం చోటుచేసుకున్న పరి ణామాలు దురదృష్టకరం. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను ఖండిస్తున్నాను. విపక్షాల తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని తెలిపారు. 

సభా మర్యాదను విపక్ష సభ్యులు మంటగలిపారంటూ ఓం బిర్లా ఆగ్రహించారు. పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని స్పష్టం చేశారు. తనకు అందిన సమాచారంతోనే ప్రధాని భద్రత కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ కారణం వల్లే ప్రధాని సభలో ప్రసం గించలేకపోయారని చెప్పారు. సభకు రాకుం డా ఉండేందుకు అంగీకరించిన ప్రధాని.. అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వలేదన్నా రు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే లోక్‌సభలో గురువారం సభ ప్రారంభమైన కొద్ది సేపటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు శుక్రవారానికి సభను వాయిదా వేశారు.

లోక్‌సభలో గురువారం ఎవరూ అనుకోని ఘటన జరిగింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ ఆమో దించింది. అయితే, ప్రధాని మోదీ ప్రసంగం లేకండానే ఆమోదం తెలిపారు. లోక్‌సభలో బుధవారం విపక్ష సభ్యుల నిరసనల కారణంగా సభ అనేకసార్లు వాయిదా పడింది. ప్రధాని మోదీ సాయంత్రం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంపై రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తారని అంతా భావించారు. కానీ విపక్షాల నిరసనతో సభ గురువారానికి వాయిదా పడింది. గురువారం సైతం విపక్ష సభ్యుల తీరులో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో.. పలుమార్లు లోక్‌సభ వాయిదా పడింది. దాంతో మోదీ ప్రసంగం లేకుండానే తీర్మానాన్ని ఆమోదించారు.

లద్దా ఖ్ ఘర్షణపై భారత సైన్యం మాజీ చీఫ్ నరవణె రాసిన పుస్తకంలోని అంశాలను ఇటీవల లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేశారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలంటూ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పట్టుబ ట్టారు. రాహుల్ నిర్ణయానికి మద్దతు ఇస్తూ 8 మంది ఎంపీలు స్పీకర్ కుర్చీ వద్దకు వెళ్లి ఆం దోళన చేపట్టారు. కాగితాలను చింపి... స్పీకర్ ఓం బిర్లాపై విసిరివేశారు. దాంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ బడ్జెట్ సమావేశాల వరకు వారు హాజరు కాకుండా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో సభ వాయిదా పడిన విషయం తెలిసిందే.