రూ.3 లక్షల ఓపీఎం పట్టివేత
22-05-2026 12:00 AM
సికింద్రాబాద్, మే21 (విజ యక్రాంతి): రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఓపీఎం, పాపిష్ఠ మత్తు మందులను స్కూటీపై తరలిస్తుండగా న్యూ బోయిన్‌ప లిలో రివేరా వైన్స్ వద్ద సికింద్రాబాద్ డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ అరెస్ట్ చేసి అతని నుంచి రూ.లక్షలు విలువ చేసే మత్తు మందులు, టూ వీలర్ స్వాధీనం చేసుకొని మొబైల్ సీజ్ చేశారు. హరీష్‌కుమార్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు డీటీఎఫ్ సీఐ తెలిపారు.






