అత్యాధునిక కాస్మెటిక్ గైనకాలజీ కేంద్రం
కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో ఘనంగా ప్రారంభం
ఆధునిక లేజర్ సాంకేతికతతో మహిళల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక చికిత్సలు
హైదరాబాద్, మే 21(విజయక్రాంతి): కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళల ప్రత్యేక ఆరోగ్య అవసరాలను దృ ష్టిలో ఉంచుకొని కాంటినెంటల్ ఎల్ సాంతే కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్ ఘనంగా ప్రా రంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొ ట్టమొదటి కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్‌గా ఇది సేవలు అందించనుంది.
కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు అండ్ చైర్మ న్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సంపూర్ణ శ్రేయస్సును మెరుగుపర్చే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన యూరోగైనకాలజిస్ట్, కాస్మెటిక్-ప్లాస్టిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ నవనీత్ మగో న్‌ను పరిచయం చేశారు. ఆయన కాంటినెంటల్ ఎల్ సాంతే కాస్మెటిక్ గైనకాలజీ సెం టర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
డాక్ట ర్ నవనీత్ మాట్లాడుతూ ఆధునిక వైద్య సాంకేతికత, లేజర్ పరికరాలు, నైపుణ్యం కలిగిన వైద్య బృందం, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో ఈ రీకన్స్ట్రక్టివ్, కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్‌ను రూపొందించినట్లు తెలిపా రు. ఇక్కడ సర్జరీ లేకుండా సర్జరీతో కూడిన చికిత్సలు రెండూ అందుబాటులో ఉంటాయని చెప్పారు.ఈ కేంద్రంలో వజైనల్ రీజువెనేషన్, లేజర్ వజైనల్ టైటెనింగ్, పీఆర్పీ థెరపీ, పెల్విక్ ఫ్లోర్ దృఢీకరణ, ఇంటిమేట్ ఏస్థెటిక్ విధానాలు వంటి సేవలు అందించబడతాయి.
డాక్టర్ నవనీత్ మగోన్ యూరోగైనకాలజీ, పెల్విక్ ఫ్లోర్ మెడిసిన్, రీకన్స్ట్రక్టివ్, కాస్మెటిక్ గైనకాలజీలో విశేష అనుభవం కలిగిన నిపుణుడు. ఆయన వేలాది విజయవం తమైన ప్రక్రియల ద్వారా మహిళలకు శారీరక సౌలభ్యం, ఆత్మవిశ్వాసం, మెరుగైన జీవన నాణ్యతను అందిం చారు అని డాక్టర్ గురు ఎన్. రెడ్డి తెలిపారు. గత 13 ఏళ్లుగా కాంటినెంటల్ హాస్పిటల్స్ భారత ఆరోగ్యరంగంలో అత్యుత్తమ సేవలు అంది స్తూ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని, మహిళల గైనకాలజీ, యూరో -గైన కాలజీ సమస్యలకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వైద్య సేవలు అందించేందుకు ఈ కేం ద్రం మరో ముందడుగని ఆయన పేర్కొన్నారు.






