ఉత్సాహంగా, ఉల్లాసంగా సమ్మర్ క్యాంప్
వేసవి సెలవుల్లో విద్యార్థుల జోష్
తాండూరు, మే 21 (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి మరింత నైపుణ్యాన్ని అందించేందుకుగాను వేసవి సెలవుల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపుల నిర్వహణ ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుగుతుంది. వికారాబాద్ జిల్లా యాలాల, పెద్దముల్ పాఠశాలల్లో విద్యార్థులకు అల్లికలు, పెయింటింగ్, జానపద నృత్యాలు, యోగ, క్యారం బోర్డ్ ,చెస్, కరాటే, దేశభక్తి గేయాలు తదితర కళలపై ప్రత్యేక శిక్షకుల ద్వారా శిక్షణలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా పెద్దముల్ పాఠశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు విద్యార్థులకు క్యాంపు నిర్వహిస్తున్నామని. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే క్యాంపులో అల్పాహారం కూడా అందిస్తున్నామని.. విద్యార్థిని విద్యార్థు లు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






