2 September, 2026 | 5:14 PM

కడ్పల్ రైతు వేదికలో పంటలను ఆన్లైన్ లో నమోదు: ఏఈవో

02-09-2026 | 03:12pm

సిర్గాపూర్, సెప్టెంబర్ 02(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో అగ్రికల్చర్ ఏఈవో సమతా రెడ్డి ఆధ్వర్యంలో సన్నవడ్ల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సన్నవడ్ల సాగు విధానం, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అంశాలను రైతులకు వివరించారు. రైతులు సన్నవడ్ల సాగుపై దృష్టి సారించి వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని, పంటలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవడం జరిగింది.