2 September, 2026 | 5:52 PM

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు

02-09-2026 | 05:01pm

తూప్రాన్,(విజయక్రాంతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ. వర్ధంతి వేడుకలను తూప్రాన్ మున్సిపల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గరిగే నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలతో మహానేతగా గుర్తింపు పొందారని చేతికి ఎముకలేని ప్రధాత, మడమ తిప్పని నేతగా గుర్తింపు పొందారని కొనియాడారు.