ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
02-09-2026 | 04:58pm
గణపురం, సెప్టెంబర్ 02 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి భాస్కరరావు ఆధ్వర్యంలో బుధవారం రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్, బత్తిని శంకర్ గౌడ్, అప్పయ్య పల్లి సర్పంచ్ ఎలకపల్లి రమేష్, గుజ్జ గంగాధర్ రావు, ఆలూరి ఎల్ల స్వామి, ముప్పిడి శంకర్, యాదగిరి వార్డు సభ్యులు గంధం ఓదాకర్, కోడెపాక అనిల్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






