2 September, 2026 | 5:31 PM

ఆదివాసి బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి

02-09-2026 | 05:04pm

ముకరంపుర,(విజయక్రాంతి): ఆదివాసి బిడ్డ ఊకే శిరీష ను అత్యంత కిరాతకంగా చంపి అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే దిశా తరహాలో శిక్షించాలని తెలంగాణ స్టేట్ బీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లిన అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసి బిడ్డ ఊకే శిరీష కుటుంబానికి జరిగిన ఈ ఘటనపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నమన్నారు.

ఆదివాసి యువతి శిరీష హైదరాబాద్‌ లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని నిజాలను కప్పి పుచ్చే ప్రయత్నాలకు తావు ఉండకుండ ఈ ఘటనలో బాధ్యులు ఎవరైనా సరే చట్టం ముందు శిక్షించాలని వెంటనే తన కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.