కొల్లాపూర్‌లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
కొల్లాపూర్ రూరల్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలను కొల్లాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, కొల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బైరపోగు సాంబశివుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సాంబశివుడు మాట్లాడుతూ.. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ తరఫున కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మండల ఉపాధ్యక్షుడు బత్తిని బాలు, కోడేరు మండల అధ్యక్షుడు నంద, పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు రవితేజ, చిన్నంబావి మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






