2 September, 2026 | 5:52 PM

కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు

02-09-2026 | 05:02pm

ముకరంపుర,సెప్టెంబర్ 2(విజయ క్రాంతి): కరీంనగర్ సాయినగర్‌లోని మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  సుందర సత్సంగ్ ట్రస్ట్ అధ్యక్షులు బొడ్ల కృష్ణ తెలిపారు.

బుధవారం  మురళీకృష్ణ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 4న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని అలాగే సాయంత్రం 4.30 గంటలకు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో చిన్నారుల ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరారు. ఈ సమావేశంలో శ్రీ సుందర సత్సంగ్ ట్రస్ట్ కార్యదర్శి ఈ. సురేందర్‌రావు, ట్రెజరర్ ఆర్. వసంతం, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.