9 May, 2026 | 3:40 AM

యువత భవితకు పోలీసు ‘రక్ష’

09-05-2026 12:15 AM

మత్తు, వ్యసనాలకు దూరంగా ఉండాలి

అనుమానం వస్తే అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి

ఎల్బీనగర్, మే 8 (విజయక్రాంతి): యువత భవిష్యత్‌కు పోలీసుల రక్షణ ఉంటుందని, మత్తు, వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని విద్యార్థులకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పిలుపునిచ్చారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇకపై హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెడతామని, అర్ధరాత్రిళ్లు ఎటు వెళ్తున్నారని గమనిస్తామని, పెట్రోలింగ్ పోలీసులతో డ్రగ్స్ టెస్టులు చేయి స్తామని హెచ్చరించారు.

గురువారం దిల్‌సుఖ్ నగర్‌లోని హోటల్స్, రెస్టారెంట్స్, ఓయో హోటల్స్, హాస్టల్స్, పేయింగ్ రూమ్స్, స్టడీ రూమ్స్ నిర్వాహకులు, స్థానిక కాలనీవాసులు, విద్యార్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. నార్కోటిక్ టీమ్, ఈగిల్ టీమ్ సభ్యులతో కలిసి సే నో టు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీ సుమతి మాట్లాడుతూ.. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా హాస్టల్స్ ఉన్న ప్రాంతం దిల్‌సుఖ్‌నగర్ అని, ఇక్కడ అనేక విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయని,  ఇక్కడికి తెలుగు రా ష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారని, ఈ కారణంతోనే దిల్‌సుఖ్ నగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ ప్రాంతంలో 3,200 కు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయని, వీటితోపాటు పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందన్నారు.

విద్యార్థులు చెడు వ్యసనాలకు గురికాకుండా హాస్టల్ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత  డ్రగ్స్, ఇతర మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వేలాది మంది విద్యార్థుల విద్యా కేంద్రంగా ఉన్న దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్ ప్రాం తా ల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు.

మత్తుపదార్థాల విక్రయాలకు కేంద్రాలుగా మారుతున్న పాన్ డబ్బాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. నిషేధిత పదార్థాలు విక్రయిస్తే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువతే దేశానికి పునాది అని, క్షణికానందం కోసం మత్తుకు బానిస కావొద్దని సీపీ సుమతి సూచించారు. ఈ కార్య క్రమంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీలు కృష్ణ య్య, కాశిరెడ్డి, ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్, శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్‌ఎ శీనయ్య, ఎంఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, గడ్డి అన్నారం మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.